Site icon NTV Telugu

Asin: అంతా ఉత్తిదే.. భర్తతో విడాకులపై స్పందించిన అసిన్

Asin

Asin

Asin: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మెరిసిన అసిన్ విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తన భర్త కలిసి ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోయారన్న పుకార్లు మొదలయ్యాయి. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పుకార్లకు అసిన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. సాధారణంగా అసిన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. తన విడాకుల వార్తల గురించి మాత్రం ఇన్‌స్టా స్టోరీలో ఆమె స్పందించడం విశేషం. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, తమ పెళ్లికి ముందు కూడా తాము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలను అసిన్ గుర్తు చేసింది. అసిన్, రాహుల్ శర్మ 2016లో పెళ్లితో ఒక్కటయ్యారు. వారి దాంపత్యానికి గుర్తుగా వాళ్లకు ఓ కూతురు ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.

Read Also:Ajmer Dargah:| అజ్మీర్ ద‌ర్గాలో మ‌హిళ డ్యాన్స్ ..

ప్రస్తుతం తాము సమ్మర్ హాలీడేస్ లో ఉన్నామని… ఆ సమయంలో ఇలాంటి పుకార్లు రావడంపై అసిన్ తీవ్రంగా స్పందించింది. “సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం. ఇద్దరం ఒకరి పక్కన మరొకరం కూర్చున్నాం. మా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఊహాజనిత, నిరాధార వార్తలు వచ్చాయి. గతంలో మా ఇరు కుటుంబాలు మా పెళ్లి పనుల్లో ఉన్న సమయంలో మేము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాకు గుర్తొచ్చాయి. మంచి హాలిడే ఎంజాయ్ చేస్తున్న సమయంలో దీని కోసం ఐదు నిమిషాల వెచ్చించాల్సి రావడం నిరాశ కలిగించింది” అని అసిన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసింది.

Read Also:YS Jagan: వాటి అన్నింటిపై దత్తపుత్రుడికే పేటెంట్‌.. పవన్‌లా మనం చేయలేం..!

Exit mobile version