NTV Telugu Site icon

Vardhan Puri: హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే.. టాలీవుడ్‌లో మెరుస్తాడా?

Vardhan Puri

Vardhan Puri

Vardhan Puri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు చాలామందే ఉన్నారు. అయితే, అందులో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బడా సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అయితే అమ్రీష్ 2005లోనే కన్నుమూశాడు. ఆ తర్వాత అమ్రీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఇప్పటి వరకు అంత ప్రభావం చూపించలేదు. కానీ., అతని మనవడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రీష్ పురి నట వారసత్వాన్ని కొనసాగించేలాగానే కనపడుతున్నాడు. అమ్రీష్ పురి మనవడి పేరు వర్ధన్ పురి. ఈ యాక్టర్ ఇవాళ (అక్టోబర్ 7) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాలు మోపాడు.

Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వీటిలో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వర్ధన్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తన తాత లాగా మెప్పించవచ్చు కదా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. వర్ధన్ చిన్నప్పటి నుంచి, అంటే ఐదేళ్ల వయసు నుంచి నాటకాలు వేస్తూ.. యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రముఖ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆపై మొదటగా రొమాంటిక్ త్రిల్లర్ ఫిలిం ‘యే సాలి ఆషికీ’ (2019)లో హీరోగా నటించాడు. ఈ సినిమాకి కథ కూడా అతనే రాయడం విశేషం. ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత, హారర్ మూవీ ‘అసెక్’, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘దశమి’లో కూడా నటించాడు. వర్ధన్ పూరి ఇంకా కొన్ని కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటైన “బ్లడీ ఇష్క్” సినిమాకు విక్రమ్ భట్, మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను చేస్తున్న మరొక సినిమా “బాబీ అవుర్ రిషి కి లవ్ స్టోరీ” కి కుణాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ నిర్మిస్తున్నారు. వర్ధన్ మరో మూవీ “గులాబ్” సంజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎండెమోల్ నిర్మిస్తున్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.

Inspirational Story : అప్పుడు వీధిలో అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు డాక్టర్..!

వర్ధన్, దర్శకుడు శేఖర్ కపుర్‌ కాంబోలో వస్తున్న సినిమాకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 37 ఏళ్ల క్రితం శేఖర్ కపుర్ వర్ధన్ తాతయ్య అమ్రీష్ నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో అమ్రీష్ ‘మొగాంబో’ అనే పాత్ర పోషించారు. ఈ పాత్ర చాలా పాపులర్ అయింది. వర్ధన్ శేఖర్ కపుర్‌తో పనిచేయడం గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు. వర్ధన్ ‘నెక్స్ట్ టు గాడ్’ అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ గల సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. శేఖర్ కపూర్ ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమా కథ భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా వైద్య సమాజంలో భద్రత అవసరమని చెబుతుంది. వర్ధన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనా అని అడిగినప్పుడు, ఆయన తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు చాలామందే ఉన్నారు. అయితే, అందులో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బడా సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అయితే అమ్రీష్ 2005లోనే కన్నుమూశాడు. ఆ తర్వాత అమ్రీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఇప్పటి వరకు అంత ప్రభావం చూపించలేదు. కానీ., అతని మనవడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రీష్ పురి నట వారసత్వాన్ని కొనసాగించేలాగానే కనపడుతున్నాడు. అమ్రీష్ పురి మనవడి పేరు వర్ధన్ పురి. ఈ యాక్టర్ ఇవాళ (అక్టోబర్ 7) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాలు మోపాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వీటిలో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వర్ధన్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తన తాత లాగా మెప్పించవచ్చు కదా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. వర్ధన్ చిన్నప్పటి నుంచి, అంటే ఐదేళ్ల వయసు నుంచి నాటకాలు వేస్తూ.. యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రముఖ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆపై మొదటగా రొమాంటిక్ త్రిల్లర్ ఫిలిం ‘యే సాలి ఆషికీ’ (2019)లో హీరోగా నటించాడు. ఈ సినిమాకి కథ కూడా అతనే రాయడం విశేషం. ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత, హారర్ మూవీ ‘అసెక్’, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘దశమి’లో కూడా నటించాడు. వర్ధన్ పూరి ఇంకా కొన్ని కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటైన “బ్లడీ ఇష్క్” సినిమాకు విక్రమ్ భట్, మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను చేస్తున్న మరొక సినిమా “బాబీ అవుర్ రిషి కి లవ్ స్టోరీ” కి కుణాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ నిర్మిస్తున్నారు. వర్ధన్ మరో మూవీ “గులాబ్” సంజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎండెమోల్ నిర్మిస్తున్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.

Ratan Tata Health Rumors: నా ఆరోగ్యంపై వచ్చే పుకార్లలో నిజం లేదు: రతన్ టాటా

వర్ధన్, దర్శకుడు శేఖర్ కపుర్‌ కాంబోలో వస్తున్న సినిమాకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 37 ఏళ్ల క్రితం శేఖర్ కపుర్ వర్ధన్ తాతయ్య అమ్రీష్ నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో అమ్రీష్ ‘మొగాంబో’ అనే పాత్ర పోషించారు. ఈ పాత్ర చాలా పాపులర్ అయింది. వర్ధన్ శేఖర్ కపుర్‌తో పనిచేయడం గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు. వర్ధన్ ‘నెక్స్ట్ టు గాడ్’ అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ గల సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. శేఖర్ కపూర్ ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమా కథ భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా వైద్య సమాజంలో భద్రత అవసరమని చెబుతుంది. వర్ధన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనా అని అడిగినప్పుడు, ఆయన తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు.

Show comments