Rajasekhar:కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ ఓపెన్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. తాజాగా శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ (Biker) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో రాజశేఖర్ మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు, తన కుమార్తెలు శివాని, శివాత్మికల వివాహంపై వస్తున్న వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు.
Also Read :Agadha: ఆకట్టుకుంటున్న ‘అగధ’ పోస్టర్..
Also Read
- Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం.. స్నాతకోత్సంలో విద్యార్థులు వింత వైఖరి
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
- CM Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
రాజశేఖర్ కుమార్తెలు ఇద్దరూ ఇప్పటికే హీరోయిన్లుగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వారి పెళ్లి గురించి వస్తున్న ప్రశ్నలకు రాజశేఖర్ స్పందిస్తూ.. ‘మా అమ్మాయిలకు మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆ దిశగా అన్వేషణ కూడా జరుగుతోంది. అయితే, వారు మాత్రం ప్రస్తుతం పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు’ అని తెలిపారు. శివాని, శివాత్మికలు మరికొంత కాలం సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నారని, వారి అభిరుచికి, నిర్ణయాలకు తండ్రిగా తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలను పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు.
ఇక రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, గతంలో తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతోనే ప్రజా సేవ చేశామని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన భార్య జీవితకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెబుతూనే, తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
-
Karnataka MLC Elections: కర్ణాటకలో మళ్లీ ‘రిసార్ట్’ రాజకీయం.. అంతా ‘క్రాస్ ఓటింగ్’ భయమేనా?
-
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం.. స్నాతకోత్సంలో విద్యార్థులు వింత వైఖరి
-
Sing Geetham: సింగ్ గీతంపై జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ చూశారా?
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!