NTV Telugu Site icon

Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..

Prakash Raj

Prakash Raj

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.

READ MORE: CM Revanth Reddy: వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది.. టీటీడీ వివాదంపై స్పందించిన సీఎం..

“నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు. ఆ యాడ్ ను ప్రసారం చేయవద్దని కోరాను. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను. నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తాను.” అని నటుడు ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు.