NTV Telugu Site icon

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌

Jacqueline Fernandez

Jacqueline Fernandez

Jacqueline Fernandez: నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరయ్యారు. తెల్ల చొక్కా, నలుపు ప్యాంటు ధరించి, న్యాయవాది వేషంలో ఆమె కోర్టులోకి చొరబడినట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిషీటును సమర్పించింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్‌ సోమవారం పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరయ్యా ఈ క్రమంలోనే బెయిల్‌ కోసం నటి తరఫు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది. రెగ్యులర్‌ బెయిల్‌ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని జాక్వెలిన్‌ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ఆమె పాత్ర ఉందని ఆరోపించినందుకు ఢిల్లీ పోలీసులు ఆమెను ప్రశ్నించడానికి రెండుసార్లు సమన్లు ​​పంపారు. ఈ కేసుకు సంబంధించి గత వారం జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేష్ చంద్రశేఖర్ మధ్య ఉన్న సంబంధం గురించి అంగీకరించినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ విశ్వసిస్తోంది. వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తెలిసింది. జాక్వెలిన్‌కు బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ అంగీకరించాడు. గతంలో సుకేష్ ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది.

గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఆస్తులను రూ.7 కోట్లకు పైగా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సమన్లు కూడా జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. సుకేష్ చంద్రశేఖర్‌పై 32కి పైగా క్రిమినల్ కేసుల్లో అనేక రాష్ట్ర పోలీసులు, మూడు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.

Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 కోట్లు వసూలు చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ ఢిల్లీ జైల్లో ఉన్న సమయంలో.. ప్రధాని కార్యాలయం, న్యాయ శాఖ, హోం శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపిస్తానని సుకేష్ ఫోన్ కాల్స్‌లో పేర్కొన్నాడు.

Show comments