కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి, X చాలామంది యూజర్లపై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 600 ఖాతాలను తొలగించింది. దాని ప్లాట్‌ఫామ్ నుండి 3,500 కంటే ఎక్కువ పోస్ట్‌లను తొలగించింది. X లోని అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత X ఈ చర్య తీసుకుంది. ప్లాట్‌ఫామ్‌లో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించడానికి అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని X ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
X (గతంలో ట్విట్టర్)లో అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఫ్లాగ్ చేసిన వారం తర్వాత ఈ చర్య తీసుకుంది. X ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న అశ్లీల కంటెంట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం చెలరేగుతోంది. అనేక ఖాతాలు Grok AIని ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను రూపొందిస్తున్నాయి. ఇది చాలా మంది నుండి విమర్శలను ఎదుర్కొంది.
Also Read:IND vs NZ: న్యూజిలాండ్‌తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే!
గ్రోక్ అనేది ఎలోన్ మస్క్ సొంత కంపెనీ xAI అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో లేదా ప్రత్యేక యాప్‌గా ఉపయోగించవచ్చు. వినియోగదారులు టెక్స్ట్ కమాండ్‌లు లేదా వాయిస్ ప్రాంప్ట్‌లను నమోదు చేయడం ద్వారా కావాల్సిన పని చేసుకునే వీలుంటుంది. ఇటీవల, గ్రోక్ అశ్లీల చిత్రాల సృష్టి, ఎడిటింగ్ ఫీచర్ వార్తల్లో నిలిచింది. AI- సహాయంతో మహిళలు, మైనర్ల చిత్రాలను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను రూపొందించడానికి దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది.