NTV Telugu Site icon

Saif Ali Khan: “ఇదంతా కుట్ర”..కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడు..

Saif Ali Khan

Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్, తాను ఎలాంటి నేరం చేయలేదని పేర్కొంటూ ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని, తనను ఇరికించడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నాడు. తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ఇస్లాం తరఫు న్యాయవాది పిటిషన్‌లో పొందుపర్చారు. అతను ఎప్పుడూ ఏంటి నేరం చేయలేదని పిటిషన్‌లో వివరించారు.

READ MORE: Robin Hood : థియెటర్‌లో ‘అదిదా సర్ప్రైజు’ పాటలో హుక్ స్టెప్ మాయం..

ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో షరీఫుల్ ఇస్లాం సహకరించారని న్యాయవాది చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్‌ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే, పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అతను సైఫ్ అలీ ఖాన్, పనిమనిషి గీతపై కర్ర, హెక్సా బ్లేడుతో దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ కేసులో బాంద్రా పోలీసులు ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. ఇస్లాం బెయిల్ పిటిషన్‌ను కోర్టు త్వరలో విచారించే అవకాశం ఉంది.

READ MORE: GVMC Budget: జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ..

ఈ కేసులో ఇస్లాం షాజాద్ న్యాయవాది మాట్లాడారు. “నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్ ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. తన న్యాయవాది ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో, తాను ఎటువంటి నేరం చేయలేదని, తనపై కేసు కల్పితమని పేర్కొన్నాడు. ప్రస్తుతం, ఈ కేసు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతోంది. కానీ ముంబై సెషన్స్ కోర్టు పరిధిలోకి వస్తుంది.” అని షరీఫుల్ ఇస్లాం షాజాద్ న్యాయవాది అజయ్ గవాలి పేర్కొన్నారు.