Site icon NTV Telugu

Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్

Bombay High Court

Bombay High Court

Bombay Highcourt: 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ 15 నాటి ఉత్తర్వులో జస్టిస్ భారతి డాంగ్రే ధర్మాసనం బాలిక స్వచ్ఛందంగా అతడి వద్దకు వెళ్లిందని.. ఆమెకు ఆ చర్యలు పర్యవసానాలు అన్నీ తెలుసని పేర్కొంది. ఆమె మైనర్‌ అయినప్పటికీ ఆమె అతడిని ప్రేమిస్తున్నట్లు అంగీకరించింది, ఆమె లైంగిక సంపర్కానికి అంగీకరించిందా లేదా అనేది సాక్ష్యం అవుతుందని ధర్మాసని పేర్కొంది. బాలిక లైంగిక చర్యను ప్రతిఘటించిందా, ఏ సమయంలో నిందితుడు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమెతో బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడా అనేది విచారణ సమయంలో నిర్ధారించాల్సి ఉంటుందని పేర్కొంది.

నిందితుడు కూడా ఒక చిన్న పిల్లవాడని.. అతడు కూడా మోహానికి గురయ్యే అవకాశాన్ని కూడా తీసిపారేయలేమని.. అతను ఏప్రిల్ 2021లో అరెస్టు చేయబడినందున అతన్ని మరింతగా నిర్బంధించాల్సిన అవసరం లేదని.. విచారణకు చాలా సమయం పడుతుందని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. బాలికతో ఎటువంటి పరిచయాన్ని ఏర్పరచుకోవద్దని, సబర్బన్ ముంబైలోని ఆమె నివాసం ఉన్న ప్రాంతంలోకి కూడా ప్రవేశించవద్దని కోర్టు అతడిని ఆదేశించింది.

Russia-Ukraine War: ప్రసూతి ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి!.. శిశువు మృతి

భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSOA) సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడిపై ఏప్రిల్ 29, 2021న బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఏప్రిల్ 6, 2021 న ముంబై శివారులోని తన అత్త ఇంటికి ఆ అమ్మాయి రాగా.. అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఏప్రిల్ 29న తన సోదరితో వాట్సాప్‌లో చాట్ చేస్తున్నట్టు కుటుంబసభ్యులు పట్టుకోవడంతో ఈ విషయాన్ని తన సోదరికి వెల్లడించినట్లు బాలిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంలో జరిగిన ఈ జాప్యాన్ని హైకోర్టు కూడా వారి దృష్టికి తీసుకువెళ్లింది. ఆ బాలిక వాట్సాప్ చాట్‌ను ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసే వరకు బాలిక మౌనంగా ఉంది. ఆమె ఏప్రిల్ 6 నుండి మౌనంగా ఉండి, సంఘటనను ఏప్రిల్ 29న బహిర్గతం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కోర్టు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

Exit mobile version