Site icon NTV Telugu

Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక

Vikramm

Vikramm

Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని ఏళ్ళ క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.

Read Also: Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..

మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే దానికంటే ముందు చిత్ర బృందం రిహార్సల్స్ లో పాల్గొన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో విక్రమ్‌కి పక్కటెముక విరిగిందని తెలుస్తోంది. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుందని సూచించినట్లు సమాచారం. విక్రమ్‌ ఈ గాయం నుంచి కోలుకున్నాకే షూటింగ్‌ మొదలవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తుంది. సినిమాలో పశుపతి, డేనియల్‌, కాల్టాగిరోన్‌ నటిస్తున్నారు.

Read Also:Kakinada Crime: కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్‌

Exit mobile version