జామకాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం చూస్తూనే ఉంటాం.. జామ కాయలు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. జామ ఆకులను ఎలా వాడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జామకాయల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈపండ్లు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగే దీని ఆకులు కూడా మనకు మంచి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు..ఈ ఆకులను హెర్బల్ టీగా కూడా ఉపయోగిస్తారు. ఇది మన శరీరాన్ని ఎన్నో శారీరక సమస్యల నుంచి కాపాడుతుంది. రోజూ జామపండును తినడం వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం పోతుంది. ఈ పండు మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే సంతానోత్పత్తిని పెంచడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయని చెబుతున్నారు..
సంతానోత్పత్తిని పెంచడానికి జామకాయ ఉత్తమ మార్గమని నిపుణులు అంటున్నారు. దీనిని తీసుకోవడం వల్ల మహిళల్లో అండోత్సర్గము, సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం జామ పండ్లను తినొచ్చు. లేదా జామ ఆకులను మరిగించి హెర్బల్ టీగా తాగొచ్చు.. ఇలా చెయ్యడం వల్ల ఇలా చెయ్యడం వల్ల ఆడ, మగ ఇద్దరిలో సంతానలేమి సమస్యలు తగ్గుతాయి.. తాజా జామ ఆకులను పేస్ట్ లా చేసి పొట్ట కింది భాగంలో అప్లై చేయడం వల్ల పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగేజామ ఆకులను పొడి చేసి రోజూ అర టీస్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.