Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తుల సులో ట్రాన్స్‌కో డీఈగా పనిచేసిన ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి నివాసంలో హాజరుపరిచేందుకు అధికారులు తీసుకెళ్లారు. హాజరు అనంతరం ముత్యం వెంకట రమణకు 14 రోజులు రిమాండ్ విధించారు జడ్జి. దీనితో ఆయనను చంచల్‌గూడ జైలుకు వెంకటరమణను ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు.
ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు దాదాపు 14 గంటలపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ప్రస్తుతం తెలంగాణ పునరుత్పాదక ఇంధన సంస్థ (TGREDCO)లో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణపై గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
వాస్తవానికి 2019లో లంచం తీసుకుంటూ వెంకటరమణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అదే రోజు ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.26 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగానే తాజాగా మరోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు నిర్వహించింది.
తాజా సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.28 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విచారణలో భాగంగా ముత్యం వెంకటరమణ తన భార్య పేరుతో నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం ఏఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేర్లతో సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. అలాగే వెంకటరమణ ఆడిటర్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, సమాచారం స్వాధీనం చేసుకుంది.
సోదాల్లో భారీ స్థాయిలో స్థిరాస్తులు, నగదు, బంగారం వెలుగులోకి వచ్చాయి. మూసాపేట ఆంజనేయ నగర్లో సుమారు రూ.20 కోట్ల విలువైన ప్లాట్లు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో ఐదంతస్తుల భవనం, కూకట్పల్లి ఆంజనేయ నగర్లో 160 చదరపు గజాల్లో నిర్మించిన మూడంతస్తుల భవనం, ఇంకా శేర్లింగంపల్లి, కూకట్‌పల్లిలో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అదేవిధంగా నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.52 లక్షల నగదు, బ్యాంకు లాకర్లలో రూ.40 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు సుమారు రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 19 విదేశీ మద్యం బాటిళ్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకటరమణకు సంబంధించిన ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంస్థల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!