ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు
- కేటీఆర్ సెకండ్ నోటీసు కాఫీ విడుదల
- విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించమని స్పష్టం
- నిబంధనలకు విరుద్ధమన్న ఏసీబీ
- సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్‌కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో చెబుతామని పేర్కొంది. ఆ డాక్యుమెంట్ సమర్పించేందుకు మీకు తగిన సమయం కూడా ఇస్తామని స్పష్టం చేసింది.
READ MORE: America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఇదిలా ఉండగా.. ఈ నెల 6న ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
READ MORE:America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్.. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరపనున్నారు
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?