NTV Telugu Site icon

ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు

Ktr

Ktr

ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్‌కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమో చెబుతామని పేర్కొంది. ఆ డాక్యుమెంట్ సమర్పించేందుకు మీకు తగిన సమయం కూడా ఇస్తామని స్పష్టం చేసింది.

READ MORE: America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిప‌బ్లిక‌న్ నేత‌ ఫైర్!

ఇదిలా ఉండగా.. ఈ నెల 6న ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

READ MORE:America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిప‌బ్లిక‌న్ నేత‌ ఫైర్!

ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్.. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరపనున్నారు

Show comments