NTV Telugu Site icon

Formula E Car Racing Case: నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ

Acb Ed

Acb Ed

నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది.

READ MORE: JPC First Meeting: నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..

ఇదిలా ఉండగా.. సంచలనం సృష్టిస్తున్న ఫార్ముల ఈ రేస్‌ కేసుపై కేటీఆర్‌ నిన్న మీడియాతో మాట్లాడారు. ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుంది అనుకుంటారన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులు ఏదో హడావుడి చేస్తున్నారని, ఏమి లేకున్నా నా మీద లొట్టపీసు కేస్ పెట్టారని ఆయన విమర్శించారు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. నా మీద కేస్ పెట్టిన చిట్టి నాయుడు కి ఒక విషయం చెప్పాలని, నేను ఏసీబీ ఆఫీసుకు వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడ్డారన్నారు. మేము కోర్టు కు వెళ్ళామని, హై కోర్టులో మేము వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేశారన్నారు. మేము సుప్రీంకోర్టు కు వెళ్ళామని, రెండు మూడు రోజుల్లో విచారణ కు వస్తుందన్నారు.

READ MORE: AFI President: ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్‌!

Show comments