Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చంద్రబాబును 2 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ చెప్పింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జి పేర్కొన్నారు. విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లను ఇవ్వాలని న్యాయమూర్తి ఏపీ సీఐడీని ఆదేశించారు. చంద్రబాబు విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి కోరారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.
Also Read: Chandrababu Quash Petition: చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ అధికారులు ఈ నెల 11న కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే ఈ నెల 10వ తేదీన కస్టడీని కోరకుండా 11 వ తేదీన మెమో ద్వారా కస్టడీని అడగడంపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.. క్వాష్ పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యం చెప్పి వెళ్లిపోయారు హైకోర్టు న్యాయమూర్తి.. దీంతో, చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఊరట దక్కకుండా పోయింది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల వినిపించిన వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. చంద్రబాబు రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు..