Chandrababu Quash Petition: టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.. క్వాష్ పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యం చెప్పి వెళ్లిపోయారు హైకోర్టు న్యాయమూర్తి.. దీంతో, చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఊరట దక్కకుండా పోయింది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల వినిపించిన వాదనలతో ఏకీభవించింది హైకోర్టు.. ఇక, క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తేల్చేయడంతో.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు కోసమే వేచి చూస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు.. క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో.. ఏసీబీ కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. చంద్రబాబు రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు..
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.. దీనికి సంబంధించిన పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.. అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను హైకోర్టు తిరస్కరించినట్టు అయ్యింది.. 17 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించలేదు హైకోర్టు.. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ వాదనలతో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది.. ఈ సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల మాట్లాడుతూ.. ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే నని.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పక్కాగా ఉందని చెబుతున్నారు.. ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశ ఉందని.. ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి.. ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందేనని.. ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిందని అంటున్నారు సీఐడీ తరఫు లాయర్లు.