ప్రస్తుతం టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక వారం రోజుల్లో మొదలు కాబోయే మెన్స్ టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ గత నెల రోజులను ముందు నుండే కసరత్తులను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కోచ్ పదవికి ఆశావాహుల నుండి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఇదివరకే ముగిసినప్పటికీ., ఆయన పదవి కాలాన్ని మరోసారి పొడిగించారు.
General Class Coaches: జనరల్ కంపార్ట్మెంట్లు రైలులో ముందు, వెనుక మాత్రమే ఎందుకుంటాయంటే..
కాకపోతే ఈసారి మాత్రం ద్రావిడ్ స్థానంలో మరో కొత్తవారిని ఎంపిక చేయాలని బీసీసీఐ దృఢంగానే నిశ్చయించుకున్నట్లు కనపడుతుంది. దీనితో ఇప్పటికే పలువురో మాజీ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్, వాట్సన్ ఇలా అనేకమంది పేర్లు బయటికి వచ్చాయి.
Guinness World Record: ఎత్తు, వెడల్పులతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. వివరాలు ఇలా..
ఇక తాజాగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. రిపోర్టర్ నుండి ఓ ప్రశ్న ఎదురయింది. రాబోయే కాలంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని మీరు భర్తీ చేయనున్నారా..? అని అడగగా.. దానికి డివిలియర్స్ తన మనసులో మాటను బయట పెట్టాడు. ఇందులో భాగంగానే తనకి కోచింగ్ అంటే చాలా ఇష్టం అని.. కాకపోతే., తాను ఇప్పుడే ఆ పదవిని చేపట్టవోనని కుండ బద్దలు కొట్టేశాడు. ఇందుకోసం తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని.. అందుకే అప్పటివరకు కోచింగ్ పదవికి కాస్త దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే ముందు కాలంలో మాత్రం ఖచ్చితంగా కోచ్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక చివరిగా టీమిండియా కోచ్ పదవి చాలా ఒత్తిడితో కూడుకున్న జాబ్ అంటూ పేర్కొన్నాడు.