కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఆ ఎద్దును చూడగానే ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా సౌమ్యంగా ఉంటుందని చూసుకొనే వారు చెబుతున్నారు.
Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..
ఇక ఈ విషయం సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో 1. 94 మీటర్ల (6 అడుగుల 4.5 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దు రోమియోని మనం చూడవచ్చు. ఈ ఎద్దు యజమాని మిస్టీ మూర్. వీరు వెల్‌కమ్ హోమ్ యానిమల్ శాంక్చురీలో 6 ఏళ్ల నుండి ఉంటున్నారు. ఇక ఈ వీడియోలో నల్లటి ఎద్దుకు ఓ మహిళ అరటిపండు తినిపిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.
ఇక రోమియో ఆహారాన్ని బాగా ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆపిల్, అరటిపండ్లు లాంటి తినుంది. ఈ ఎద్దు ప్రతిరోజూ 45 కిలోగ్రాముల ఎండుగడ్డి, అలాగే ధాన్యాలు, ఇతర ఆహారాన్ని కూడా తినగలదు.
Meet Romeo, the world's tallest steer at a height of 1.94 metres (6 ft 4.5 in) ✨
Romeo is a 6-year-old Holstein steer who lives at Welcome Home Animal Sanctuary with his human, Misty Moore. pic.twitter.com/MZqCB7fkgM
— Guinness World Records (@GWR) May 22, 2024