Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో నిరంతరం శ్రమిస్తూ, తెర వెనుక ఉండి తెరపై మెరుపులు మెరిపించే గ్రూప్ డ్యాన్సర్లకు అండగా ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)తో పాటు చెన్నై యూనియన్ సభ్యులకు ఆయన అధికారిక ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. సాధారణంగా యూనియన్ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం మాస్టర్లు డ్యాన్సర్ల అసైన్మెంట్ల నుంచి కొంతమేర కమిషన్ పొందే హక్కు ఉంటుంది. అయితే, తన వ్యక్తిగత నిర్ణయం మేరకు తాను ఏనాడూ ఆ కమిషన్‌ను ఆశించలేదని, భవిష్యత్తులో కూడా తీసుకోబోనని సందీప్ తెలిపారు.
తాను కూడా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన డ్యాన్సర్నేనని గుర్తుచేసుకున్న సందీప్, “ఒక డ్యాన్సర్ కెరీర్ నిర్మించుకోవడానికి ఎంతగా చెమటోడ్చాలో, ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవాలో నాకు స్వయంగా తెలుసు. వారి అంకితభావం, ప్యాషన్, నిరంతర శ్రమ ఎంతో గొప్పవి. అందుకే వారి కష్టార్జితాన్ని పూర్తిగా గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాదు, చెన్నై యూనియన్‌లో పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ కమిషన్ తీసుకోలేదు. నా రాబోయే ప్రాజెక్టులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది” అని సందీప్ పేర్కొన్నారు. తన తాజా ప్రాజెక్టులు ‘యేషానాగుల’, సాంగ్ కి తోడ్పాటు అందించిన అసోసియేషన్ పెద్దలకు, డ్యాన్సర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తోటి కళాకారుల శ్రమను గుర్తించి, వారికి పూర్తి పారితోషికం దక్కేలా సందీప్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై డ్యాన్స్ వర్గాల నుంచి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!