NTV Telugu Site icon

Delhi Liquor case: లిక్కర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి

See

See

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తులను కేసుల్లో ఇరికించడం సహజం.. అలాంటిది ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుడిగా చేర్చనున్నట్లు హైకోర్టుకు ఈడీ తెలియజేసింది. ఒక రాజకీయ పార్టీని ఒక కేసులో నిందితుడిగా చేర్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మద్యం పాలసీ కేసులో ఆప్‌ను నిందితుడి మారుస్తామని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

ఇది కూడా చదవండి: TDP vs YCP Fight: వాదంపల్లిలో ఉద్రిక్తత.. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువుర్ని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం కవితను, కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: ప్రజలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారు..

అయితే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈడీ.. ఆప్‌కు భారీ షాకిచ్చింది. ఏకంగా పార్టీనే నిందితుడిగా చేర్చుతున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ఆప్ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?