Ira Khan-Nupur Shikhare: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త్వరలో తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ కూతురు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంలో దిగిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాతో పంచుకున్నారు. కొంతకాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత, అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నవంబర్ 2022లో తన ప్రియుడు నుపుర్ శిఖరేతో అధికారికంగా నిశ్చితార్థం చేసుకుంది. ఈ జంట ఇప్పుడు 2024 జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ జంట నిన్న కెల్వన్ వేడుకను నిర్వహించింది. దీనితో వారి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు ప్రారంభమయ్యాయి. నుపుర్ మహారాష్ట్రకు చెందిన వాడు, కనుక ఇది ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరుగనుంది.
Read Also:Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. రీల్స్ కూడా..
కెల్వన్ ఫంక్షన్ అంటే.. వధూవరుల కుటుంబాలు పెళ్లికి ముందు సంప్రదాయ రుచికరమైన భోజనం చేసుందుకు ఒకరినొకరు కలుసుకుంటారు. తద్వారా ఒకరినొకరు పెళ్లికి ఆహ్వానించవచ్చు. ఇందులో ఒకరికొకరు బహుమతులు కూడా ఇస్తారు. వధూవరుల బంధువులు కూడా ఈ వేడుకకు హాజరై పెళ్లి చేసుకున్న జంటను ఆశీర్వదించి వారికి బహుమతులు అందజేస్తారు.
Read Also:Samajika Sadhikara Bus Yatra: ఏడో రోజుకు చేరిన సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు ఎక్కడంటే..
ఇరా, నుపుర్‌ల కెల్వన్ ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. చిత్రాలలో కాబోయే వధువు ఒక అందమైన గులాబీ-తెలుపు లహరియా చీరను ధరించింది. ఈ సమయంలో ఇరా, నూపూర్ ఇద్దరి బంధువులు వారితో కనిపించారు. ఒకదానిలో రీనా దత్తా నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖరేతో కలిసి కనిపించింది. ఇరా సన్నిహితురాలు నటి మిథిలా పాల్కర్ కూడా ఆమెతో కనిపించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఇరా, నుపుర్ కోర్టు వివాహం చేసుకోనున్నారు. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్ వెళ్లనున్నారు. ఇరా తండ్రి అమీర్ తన కుమార్తె వివాహ రిసెప్షన్‌ను జనవరి 13న ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రిసెప్షన్‌కు సినీ పరిశ్రమకు చెందిన వారిని అమీర్ స్వయంగా ఆహ్వానిస్తున్నాడు. గెస్ట్ లిస్ట్ లో యంగ్ స్టార్స్ నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు అందరూ ఉన్నారు.