NTV Telugu Site icon

AAP: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్

Aao

Aao

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అభ్యర్థులతో కూడా జాబితా అధిష్టానం విడుదల చేసింది. హోషియార్‌పూర్ నుంచి రాజ్ కుమార్ చబ్బెవాల్, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి మల్వీందర్ సింగ్ కాంగ్ పోటీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Purandeswari: ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..

ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఆప్ సీట్ల షేరింగ్ జరిగింది. ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: CM Jagan: డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీసియల్ కస్టడీ విధించింది. దీంతో సోమవారం ఆయన్ను తీహార్ జైలుకు పంపించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టడంతో పార్టీ ప్రచారం సన్నగిల్లింది. నేతలంతా కేజ్రీవాల్‌పైనే పోకస్ పెట్టారు. దీంతో ప్రచారాన్ని ముందుకు నడిపించేవారు లేక డీలా పడింది. ఇక ఇదే కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.