Aadi srinivas: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో నువ్వా..నేనా.. అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం దారుణమని.. బీసీ బిల్లు అమలవకూడదని ఆయన కోరుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ అన్నారు.
అలాగే.. బీజేపీ అగ్రకుల పార్టీ. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో అన్ని రంగాల్లో బీసీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ.. మీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..? బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వమని అధిష్ఠానాన్ని ఎందుకు అడగరు..? అని రఘునందన్ రావును ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం మాటలకే పరిమితం కాదని. మన్మోహన్ సింగ్ లాంటి నేతను రెండుసార్లు ప్రధానిగా చేసిన ఘనత మాదే అని అన్నారు. ఇలాంటివి బీజేపీకి సాధ్యం కాదని, బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు తెచ్చారని అన్నారు. ఇది సామాజిక న్యాయం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంఅంటూ కొనియాడారు.
HHVM : పార్ట్ 2 పై వీరమల్లు టీమ్ క్లారిటీ..
బీజేపీ కేంద్రంలో ఉండి బీసీ బిల్లును ఆమోదించకపోతే, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని.. బీసీల గురించి ఖచ్చితమైన ఆలోచన ఉంటే, ఇప్పటికీ కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదం తెలిపేదని మండిపడ్డారు.
