NTV Telugu Site icon

Aadi Srinivas : కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు?

Aadi Srinivas

Aadi Srinivas

కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందు ఉంచి రూ. లక్ష 79 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి ఏం నొప్పి అని విమర్శించారు. బీఆర్ఎస్ పాటనే కిషన్‌రెడ్డి పాడుతున్నారన్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని మీరు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తారా? అని మండిపడ్డారు.

READ MORE: Manchu Vishnu: టాలీవుడ్‌లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..

“దావోస్‌కు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం వెళ్లలేదా? బీజేపీ ముఖ్యమంత్రులతో పోటీ పడి కంపెనీలను ఆకట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు.. తన ప్రసంగంతో పెట్టుబడి దారులను సీఎం రేవంత్ రెడ్డి ఆకట్టుకున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్‌కు పెట్టుబడిదారులు ఫిదా అయ్యారు.. దావోస్ నుంచి తీసుకువచ్చిన పెట్టుబడులను చూసి కిషన్ రెడ్డి గర్వించాలి.. ప్రశ్నించే గొంతుల దగ్గరకు సీబీఐ, ఈడీని బీజేపీ పంపిస్తోంది.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్రం సహకరించాల్సింది పోయి విమర్శలా? కిషన్ రెడ్డి శాపనార్థాలు పెట్టేలా మాట్లాడటం సరైనది కాదు.. చేతనైతే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి.. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకమైనా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందా? ఎక్కడైనా రైతు రుణమాఫీ చేశారా? కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు.. పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాలే.. బీఆర్ఎస్ నలుగురికి దోచి పెడితే బీజేపీ ఆ ప్రభుత్వం ఆ ఇద్దరికి దోచి పెడుతోంది..” అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషిని విమర్శిస్తున్న కిషన్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు.

READ MORE: Bandi Sanjay: అలాంటి వారిని బీజేపీలో చేర్చుకోం.. బండి సంజయ్ కీలక ప్రకటన