NTV Telugu Site icon

Aadi Srinivas : స్వయం సహాయక గ్రూపులను నిర్వీర్యం చేయలేదా..?

Aadi Srinivas

Aadi Srinivas

మహిళ మీద ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ మాట్లాడుతున్నాడని, గత పదేళ్లలో మహిళలను అన్ని రకాలు అణచివేసింది కేసీఆర్ కాదా..? కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంత్రుత్వ పోకడలు పోయింది మీరు కాదా..? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా…? మహిళల కోసం ఒక్క కార్యక్రమమైన మీ ప్రభుత్వం చేసిందా..? అని ఆయన వ్యాఖ్యానించారు. బతుకమ్మ చీరలు ఇచ్చామని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎలా ఉన్నాయో తెలంగాణ అక్క చెల్లెమ్మలకు తెలుసు అని, మీరు ఇచ్చిన చీరలు పాత సామాన్ల కు, పంట చేలకు అడ్డం కట్టడానికి తప్ప కట్టుకోవడానికి ఉపయోగపడలేదన్నారు ఆది శ్రీనివాస్‌.

Tech Tips: కీబోర్డుపై F – J అక్షరాల క్రింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా?

హరీష్ రావు.. నీకు కనీసం సిగ్గుండాలి.. మహిళల గురించి మాట్లాడటానికి, మా ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులను ఎలా గౌరవిస్తుందో నీ కళ్లకు కనిపించడం లేదా అని ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇళ్లకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఇందిరా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేశామన్నారు. స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్‌. మహిళలనే యజమానులుగా పేర్కొంటు ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తున్నామని, ఒక ఆదివాసీ, ఒక బీసీ మహిళకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించామన్నారు. మహిళాభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని, నోరు తెరిస్తే మహిళలను అవమానించేలా మాట్లాడే కేటీఆర్ ను పక్కన పెట్టుకొని మాట్లాడుతావా హరీష్ రావు అని ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. ఇప్పటికైనా మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపకపోతే తెలంగాణ అక్కచెల్లెమ్మల చేతిలో మరో సారి మీరు చిత్తు కావడం ఖాయమని ఆయన అన్నారు.

Minister Satya Kumar Yadav: ఏ మేరకు మార్పు తెచ్చారు?.. 30 అంశాల కార్యాచ‌ర‌ణ ప్రణాళిక అమ‌లుపై మంత్రి స‌మీక్ష