Aadi Srinivas : స్వయం సహాయక గ్రూపులను నిర్వీర్యం చేయలేదా..?
- స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా...? మహిళల కోసం ఒక్క కార్యక్రమమైన మీ ప్రభుత్వం చేసిందా.. : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళ మీద ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ మాట్లాడుతున్నాడని, గత పదేళ్లలో మహిళలను అన్ని రకాలు అణచివేసింది కేసీఆర్ కాదా..? కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంత్రుత్వ పోకడలు పోయింది మీరు కాదా..? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా…? మహిళల కోసం ఒక్క కార్యక్రమమైన మీ ప్రభుత్వం చేసిందా..? అని ఆయన వ్యాఖ్యానించారు. బతుకమ్మ చీరలు ఇచ్చామని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎలా ఉన్నాయో తెలంగాణ అక్క చెల్లెమ్మలకు తెలుసు అని, మీరు ఇచ్చిన చీరలు పాత సామాన్ల కు, పంట చేలకు అడ్డం కట్టడానికి తప్ప కట్టుకోవడానికి ఉపయోగపడలేదన్నారు ఆది శ్రీనివాస్.
Tech Tips: కీబోర్డుపై F – J అక్షరాల క్రింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా?
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
హరీష్ రావు.. నీకు కనీసం సిగ్గుండాలి.. మహిళల గురించి మాట్లాడటానికి, మా ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులను ఎలా గౌరవిస్తుందో నీ కళ్లకు కనిపించడం లేదా అని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇళ్లకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఇందిరా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేశామన్నారు. స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. మహిళలనే యజమానులుగా పేర్కొంటు ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తున్నామని, ఒక ఆదివాసీ, ఒక బీసీ మహిళకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించామన్నారు. మహిళాభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని, నోరు తెరిస్తే మహిళలను అవమానించేలా మాట్లాడే కేటీఆర్ ను పక్కన పెట్టుకొని మాట్లాడుతావా హరీష్ రావు అని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపకపోతే తెలంగాణ అక్కచెల్లెమ్మల చేతిలో మరో సారి మీరు చిత్తు కావడం ఖాయమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?