Site icon NTV Telugu

Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ vs చెన్నమనేని రమేష్.. పౌరసత్వం వివాదంపై సీఐడీ విచారణ

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్‌ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పును ప్రస్తావించారు. కోర్టు తేల్చిచెప్పినట్లు, రమేష్ భారతదేశ పౌరుడే కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆది శ్రీనివాస్ తెలిపిన ప్రకారం, చెన్నామనేని రమేష్ తన తప్పును ఒప్పుకొని ఇప్పటికే ₹30 లక్షలు ప్రభుత్వానికి చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే, ఇది సరిపోదని పేర్కొంటూ, చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను కోరారు. ఇంకా, రమేష్ భారత పౌరుడే కానప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తీసుకున్న జీతభత్యాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం, కేంద్ర ఎన్నికల సంఘం , కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకొని సమగ్ర విచారణ జరపాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

Gorantla Madhav: నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..

Exit mobile version