Adhaar: ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌పై కేంద్రం శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ ఉచిత అప్‌డేట్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఎల్లుండి (మార్చి 14)తో ముగుస్తోంది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
తాజా నిర్ణయంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. తొలుత 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇక ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ వివరాలు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకోసం వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. అలాగే టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటిగా మారింది. కానీ ఇది అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్‌ల్లో ఇది ప్రామాణిక గుర్తింపు కార్డుగా మారింది. అయితే అప్‌డేట్ చేసుకోవాలని అనుకునే వారు వారి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
#UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders.
This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt— Aadhaar (@UIDAI) March 12, 2024
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!