Crime News: ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A young woman was killed by a man For Not Accepting Love in Komarambhim District: యువతుల వెంటపడి ప్రేమించమని వేధించడం అలా చేయకపోతే వారిని చంపేయడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. యువతి రోడ్డుపై వెళుతున్నప్పుడు యాసిడ్ పోసిన ఘటనలు, నడి రోడ్డుపై యువతిని కత్తితో పొడిచి చంపినట ఘటనలు, గొంతు కోసి, కారుతో గుద్ది హత్య చేసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ యువకుడు.
Also Read
సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావ్ పెట్ గ్రామానికి చెందిన బూడే దీప (19) వెంట చాలా కాలం నుంచి కమలాకర్ అనే వ్యక్తి పడుతున్నాడు. తనను ప్రేమించాలని అనేక సార్లు అడిగాడు. కమలాకర్ ఇప్పటికే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా కూడా ఉండటంతో దీప అతని ప్రేమను నిరాకరించింది. తన వెంట పడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే తనను ప్రేమించకపోతే దీప కుటుంబ సభ్యులను చంపేస్తానని కమలాకర్ అనేక సార్లు బెదిరించాడు. అయినా దీప అతడిని ప్రేమించలేదు. దీంతో దీప మీద కోపం తెచ్చుకున్న దుర్మార్గుడు ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. తనకు దక్కని దీప ఎవరికి దక్కకూడదనుకున్నాడు. ఆవేశంలో పశువుల మారిన కమలాకర్ యువతిని హత్య చేశాడు. దీపకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ దీప మృతి చెందింది. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కమలాకర్ కోసం గాలింపు చేపట్టారు. యువతిని దారుణంగా హత్య చేసిన కమలాకర్ ను పట్టుకొని తగిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!