Bangalore Stampede: 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ సొంతం చేసుకుంది.. ఇక, కప్ కొట్టిన తర్వాత తొలిసారి బెంగళూరులో అడుగుపెట్టిన ఆర్సీబీ టీమ్‌కు అపూర్వస్వాగతం లభించింది.. ఆనందంతో బెంగళూరు నగరం ఊగిపోయింది.. కానీ, ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన చిన్నస్వామి స్టేడియంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.. ఉహించని విధంగా.. ఈ ఘటనలో ఏకంగా 11 మంది మృతి చెందాదారు.. దాదాపు 33 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది..
Read Also: Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన జడ్జికి బెదిరింపులు
ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట ఘటనలో 11 మృతి చెందగా.. తొక్కిసలాటలో ఏపీకి చెందిన దేవి అనే యువతి కూడా మృతి చెందిందింది.. కోయంబత్తూరులో ఉద్యోగం చేసే దేవి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు పెద్ద అభిమాని.. ఆర్సీబీ ఐపీఎల్ కప్ కైవసం చేసుకోవడం.. ఆ జట్టు బెంగళూరుకు వస్తున్న నేపథ్యంలో.. కోయంబత్తూరు నుంచి బెంగళూరు చేరుకుంది దేవి.. కేవలం ఆర్బీసీ జట్టు కోసం బెంగుళూరు వచ్చింది.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గెలుపు సంబరాల సమయంలో ఊహించని ఘటనతో ప్రాణాలు విడిచింది.. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. కాగా, అభిమానుల ఎంత మంది వచ్చారు? అని అంచనా వేయడంలో నిర్వాహకులు విఫలం అయ్యారు.. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20 నంబర్ గేట్లన్నింటినీ తెరవడం.. స్టేడియంలోపలికి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో.. తొక్కిసలాట జరిగి.. 11 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. అభిమానులను అదుపుచేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేసినా పరిస్థితి కంట్రోల్‌లోకి రాని పరిస్థితి ఏర్పడింది..