NTV Telugu Site icon

Delhi Crime: ఢిల్లీలో దారుణం.. బైక్ పై వెళ్తున్న ఏఎస్సైపై ఓ వ్యక్తి కాల్పులు

Delhi Fire

Delhi Fire

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏఎస్‌ఐతో ముఖేష్‌కు గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

UPSC CSE Result 2023: UPSC టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ‌ ఎవరు..? ఎక్కడ విద్యను అభ్యసించారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీట్ నగర్ ఫ్లైఓవర్‌ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌కు 11:42 గంటలకు సమాచారం అందిందని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జే.టిర్కీ చెప్పారు. ఏఎస్సైపై కాల్పులు జరుపుతుండగా.., పక్కనుంచి వెళ్తున్న బైకిస్ట్ కు కూడా బుల్లెట్ తాకిందని తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు.

T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి

ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. నిందితుడు ముఖేష్ కుమార్, ఎఎస్సై మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు కాల్పులకు పాల్పడిన తర్వాత.. ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో.. ఆటో డ్రైవర్ మెహమూద్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆటోలో నుంచి వెళ్లిపోయాడు. కాగా.. ఘటనస్థలిలో పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.