NTV Telugu Site icon

Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అందుకు అడ్డు వస్తున్నాడని..!

Hyd

Hyd

ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది భార్య. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో గత కొంతకాలంగా భర్త స్వామి, భార్య కావ్య నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న కావ్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కిరాతకంగా చంపింది. పథకం ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేసి నిజామబాద్ లో చంపింది భార్య. అనంతరం భర్త మృతదేహంను జవహర్ నగర్ తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో కాల్చివేశారు.

Bengaluru: బెంగళూరులో విషాదం.. ఎంత ఘోరం జరిగిపోయింది!

గత కొంతకాలం నుంచి లావిష్ లైఫ్ కు అలవాటు పడ్డ కావ్య.. కారు డ్రైవర్ ప్రణయ్ తో అక్రమసంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా.. లోన్ యాప్ ద్వారా రూ.8 లక్షలు తీసుకొని ప్రియుడుకి ఇచ్చింది. అయితే.. ప్రియుడితో కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న భార్యను చూసి భర్త స్వామి వార్నింగ్ ఇచ్చాడు. అయితే.. వారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు.

Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తుంది..

పథకం ప్రకారమే భర్తను ప్రియుడితోపాటు నిజామాబాద్ కు పంపించింది భార్య కావ్య. అయితే కారులో ప్రయాణిస్తుండగా.. భర్త స్వామి నిద్రపోతున్న సమయంలో ప్రియుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకొని ఒకరోజు పాటు తిరిగాడు ప్రియుడు. ఆ తర్వాత.. స్వామి మృతదేహాన్ని జవహర్ నగర్ దగ్గరకు తీసుకువచ్చి కాల్చివేశాడు. కాగా.. వారం రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహంను పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.