Site icon NTV Telugu

Wife Killed Husband: దారుణం.. 10 సెంట్ల స్థలం కోసం భర్తను చంపిన భార్య

Wife Killed Husband

Wife Killed Husband

Wife Killed Husband: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 10 సెంట్ల స్థలం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. భర్తకు గల పది సెంట్ల స్థలం అమ్మమని గత కొన్నాళ్ళ నుంచి ఒత్తిడి చేస్తుంది. స్థలం అమ్మడం కుదరదని భర్త తేగేసి చెప్పడంతో భర్త, అత్తతో తరచూ గొడవలు అయ్యాయి. నిన్న రాత్రి భర్త తాగే మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసింది భార్య. తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు భార్య శివలక్ష్మిపై సెక్షన్ 302 , 201గా కేసు నమోదు చేశారు.

Read Also: Viral Video : గ్యాస్ స్టవ్ ఇలా చేతితో వెలిగించొచ్చని తెలియక.. ఇప్పటికి ఎన్ని లైటర్లు కొన్నామో

Exit mobile version