Peddapalli: వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
Read Also: SSMB29: మరో స్టార్ హీరోను దింపుతున్న జక్కన్న
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగి యువకుడు మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామంలో ఈ విషాదం జరిగింది.. గోదావరిఖనికి జై భీమ్ నగర్‌కు చెందిన రాజీవ్ గాంధీ అనే యువకుడు గోదావరిఖనిలో కిరాణం షాప్ నిర్వహిస్తూ సింగరేణి ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. తన సొంత గ్రామమైన ముప్పిరితోటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉండడంతో బ్రహ్మోత్సవాలకు వెళ్లి చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాకు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావిలోకి వెళ్లారు.. రాజీవ్ కు ఈత రాకపోవడంతో ప్లాస్టిక్ క్యాన్ ను తాళ్లతో కట్టుకొని బావిలోకి దూకాడు.. అయితే, ఆ ప్లాస్టిక్ క్యాన్‌కు హోల్ పడడం.. అందులోకి నీళ్లు వెళ్లడంతో.. రాజీవ్ గాంధీ ఆ వ్యవసాయ బావిలో నీట మునిగి మరణించాడు.. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.. ఘటనస్థలానికి పోలీస్ బృందం చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.. రాజీవ్ మృతదేహాన్ని వెలికితీయడంతో క్యాన్ పూర్తిగా మునిగి తాళ్లతో ఉండడంతో దానిని చూసిన స్థానికులు సైతం కన్నీరు మున్నీరయ్యారు..
