Site icon NTV Telugu

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అరుదైన రికార్డు..

Justice Amarnath Goud

Justice Amarnath Goud

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ రికార్డ్‌ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్‌ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది.

Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..

2017 నుంచి ఇప్పటివరకు 92 వేల కేసులు పరిష్కరించారు జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్.. హైదరాబాద్ వాసి అయిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్.. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే 2017లో సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఆ తర్వాత త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.. ఈ సందర్భంగా తన బెంచ్‌లో కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలిపారు.

Read Also: Margani Bharat: ప్రజలు ఏం కొన్నా ఒక్క శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి..

Exit mobile version