త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ రికార్డ్ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
Mukesh Ambani Family Security Case: పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది.