Misbehaving: నన్ను తన గదికి పిలిచాడు.. పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు
- పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు
- ఆగ్రా సిటీ జోన్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో ఇద్దరు విధులు
- తనపై ఒత్తిడి చేసి ఇన్స్పెక్టర్ తనను గదికి పిలిచారు- ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్
- పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఆగ్రా సిటీ జోన్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో నియమించబడిన ఇన్స్పెక్టర్పై ట్రైనీ ఇన్స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై ఒత్తిడి చేసి ఇన్స్పెక్టర్ తనను గదికి పిలిచారని ఆరోపించారు. ఈ ఘటనపై ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. రెండు రోజుల్లో ఏసీపీ ఎత్మాద్పూర్ సుకన్య శర్మ నుంచి విచారణ నివేదిక కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇన్ స్పెక్టర్ ఫోన్ లో అసభ్యకర మాటలు మాట్లాడేవారని ట్రైనీ ఇన్స్పెక్టర్ తెలిపింది. అంతేకాకుండా.. స్టేషన్ లో కూడా అలాంటి వ్యాఖ్యలు చేసేవారని పేర్కొంది. హోలీ రోజున తనను పోలీస్ స్టేషన్లో ఉంచి.. తప్పు చేసేందుకు ప్రయత్నించారని చెప్పింది. తాను చెప్పినట్లు వినకుంటే బెదిరించారని తెలిపింది. అంతేకాకుండా.. తన నివాసంలో పడుకో అన్నాడని బాధితులు పేర్కొంది. అతను తనను పోలీస్ స్టేషన్ బయట రూమ్ తీసుకోవాలని వేధించేవాడని చెప్పింది. ఈ క్రమంలో.. మార్చి 17వ తేదీని తాను పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ కమిషనర్ కు వినతిపత్రం రాసింది. అనంతరం.. ఆమె సెలవుపై వెళ్లింది.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
Read Also: Foods for Kids: ఈ ఆహార పదార్థాలు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగు..
ఆ వినతిపత్రంలో తనను ఇంట్లో పెళ్లికి నిరాకరించమని ఇన్స్పెక్టర్ చెబుతున్నారని ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్ ఆరోపించింది. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడన్నారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. మరోవైపు.. జూన్ 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అతను కాల్ చేశాడని.. బయట వేడిగా ఉంది.. తన గదిలో ఏసీ ఉంది. వచ్చి పడుకో అని అన్నారని తెలిపింది. ప్రతిరోజు అతని కులం గురించి చెబుతుండేవాడని.. అతను షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని దరఖాస్తులో తెలిపింది. ఈ క్రమంలో.. అతనిపై తగిన శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని వేడుకొంది.
ఈ కేసు గురించి డీసీపీ సిటీ సూరజ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. ఈ ఫిర్యాదుకు ముందు ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్పై కూడా ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ రెండు కేసులను ఏసీపీ ఎత్మాద్పూర్ సుకన్య శర్మ విచారించనున్నారని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇస్తామని.. విచారణ నివేదిక ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!