NTV Telugu Site icon

Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?

Viral Video

Viral Video

Shocking Video Trending in Social media: కొన్నిసార్లు అప్పటివరకు మన ముందరే ఉన్న వారు మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న చించ్‌వాడ్‌లోని బోప్‌ఖేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Raj Tarun – Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ చచ్చాడని వదిలేస్తున్న.. కానీ.?

అందిన సమాచారం మేరకు జులై 31 నా గిరిజ షిండే అని మూడేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో గిరిజ తన స్నేహితురాలితో కలిసి ఓ టెడ్డీబేర్ బొమ్మను తీసుకొని నడుస్తున్న సమయంలో ఆమెతో పాటు ఆడుకుంటున్న ఓ అబ్బాయి ఇంటి ఇనుప గేటును మరోవైపుకు లాగాడు. అయితే., ఆ గేటు పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆ పాపపై పడింది. దీంతో భయపడి పోయిన పిల్లలు వెంటనే ఆ సంఘటనను అమ్మాయి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. దాంతో గిరిజ తండ్రి ఇంటి నుంచి బయటికి త్వరగా వచ్చి గేటును తొలగించాడు. ఆపై ఆ చిన్నారిని అత్యవసర చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

Kollywood: నిర్మాతలు vs నటులు.. ఆగస్టు 15 తర్వాత షూటింగులు బంద్.?

కాకపోతే., దురదృష్టం కొద్దీ చిన్నారి గిరిజ అక్కడి చేరుకునే లోపే ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి తర్వాత విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేబడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Show comments