పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ 1122 ప్రకారం.. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్క్యూ టీమ్, స్థానిక ప్రజలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు 11 మంది మరణించినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Kaviya Maran: మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. బాధలో ఉండొద్దు
ఈ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. బాధితులు తమ బంధువులను కలిసేందుకు ముల్తాన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రక్కు డ్రైవర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ట్రక్కు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగంగా నడుపుతుండటంతో కంట్రోల్ చేయలేదని.. దీంతో ట్రక్కు ప్యాసింజర్ వ్యాన్‌ను ఢీకొట్టిందని ట్రక్కు డ్రైవర్ చెప్పాడు.