NTV Telugu Site icon

Heart Attack: స్టూడెంట్స్‎కు పాఠాలు చెబుతూ ఆగిన గుండె

Heart Attack

Heart Attack

Heart Attack: ఇటీవల కాలంలో మరుక్షణం ఏం జరుగుతుంది.. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పడం కష్టమవుతోంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు గుండెపోటుకు గురవుతున్నారు. రోజురోజుకు గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతునే ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు. ఆ తరువాత కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరోప్రాంతంలో మరో వ్యక్తి ఇంటినుంచి ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే గుండె పట్టుకుని కుప్పకూలిపోయిన ప్రాణాలు కోల్పోయారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగితే..మరొకటి తెలంగాణలో గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also:Kodali Nani: మార్చి 22 ఉగాదిన సీఎం జగన్ చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్ల ప్రారంభం

వివరాలు.. బాపట్ల జిల్లాలోని చీరాల మండలం వాకా వారి పాలెం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఇంకొల్లు గ్రామానికి చెందిన వీరి బాబు (45) ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం యధావిధిగా విధులకు హాజరైన ఆయన విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో కుప్ప కూలి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వెంటనే 108 సిబ్బందిని పిలిచారు. కానీ అప్పటికే టీచర్ చనిపోయినట్లు వారునిర్ధారించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని మరణాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు కన్నీటి పర్యంతరం చెందారు. రోజు కూర్చొని పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు అదే కుర్చీలో ప్రాణాలు విడవడాన్ని సహోపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read Also: Influenza: కోవిడ్ తరహాలో ఫ్లూ.. ఇండియా వ్యాప్తంగా పెరిగిన కేసులు.. లక్షణాలు ఇవే..

తెలంగాణలోనూ గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. పెదపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ సోదరుడు శైలేంద్రసింగ్ గుండెపోటుతో మరణించారు. అపార్ట్ మెంట్ నుంచి ఉదయం బయలుదేరారు శైలేంద్ర సింగ్. ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి తలుపులు వేసి లిఫ్ట్ వద్దకు వెళ్లారు. అప్పటికే గుండెలో ఏదో ఇబ్బందిగా ఉండి అక్కడే గోడకు చేరబడ్డారు. కానీ ఎక్కువ సేపు నిలవలేక అక్కడే కుప్పకూలిపోయారు. కేవలం 40 సెకన్లలో శైలేంద్రసింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు గుండెపోటుతో మృతి చెందారు. నిన్న తూప్రాన్ లో గుండె పోటుతో నిద్రలోనే చనిపోయిన 23 ఏళ్ల యువకుడు.. ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని లచ్చపేటలో గుండెపోటుతో ఖాజా మొయినోద్దీన్(37) మృతి చెందాడు. అలాగే, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట (మం) మల్కాపూర్ లో గుండెపోటుతో సాయిలు (33) అనే వ్యక్తి మృతి చెందాడు.

Show comments