చెన్నైలో ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్‌పై ఉన్న టీవీ కేబుల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
READ MORE: Parliament ‘assault’ case: రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు..!
చెన్నైలోని చిన్నమలైలోని రెండవ వీధిలో నివసించే ఆకాష్ చిన్న పనులు చేసేవాడు. అతని తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. సోదరుడు, తల్లి తో కలిసి ఉంటున్నాడు. కోవిడ్ సమయంలో ఆకాష్ కు ఆన్‌లైన్ రమ్మీ అలవాటైంది. అతని వ్యసనం పెరుగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం తన తల్లికి చికిత్స నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.30 వేలుతో ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఇంట్లో ఉంచిన డబ్బులు కనిపించకపోవడంతో తల్లి, సోదరుడు విచారించారు. విషయం తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో ఆకాష్‌కి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
READ MORE: Tamil Nadu: దేవుడి హుండీలో పడిన ఐఫోన్.. వ్యక్తికి షాకిచ్చిన ఆలయ నిర్వాహకులు…
శుక్రవారం రాత్రి ఆకాష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడ్డారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు రాత్రంతా వెతికారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు డాబాపై చూసే సరికి ఆకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కొట్టుపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.