Site icon NTV Telugu

IND vs ENG: ఇంగ్లండ్ ముందు గౌరవప్రదమైన స్కోరు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్

Ind Match

Ind Match

లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టీమిండియాను 229 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 101 బంతుల్లో అత్యధికంగా 87 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు ఆడి స్కోరును ముందుకు పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 49 పరుగుల చేశాడు.

Read Also: Srinagar: పోలీస్ అధికారిపై ఉగ్రవాది దాడి.. ఈద్గా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా ఘటన

ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలం కాగా.. మిడిలార్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్ (49) పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (8), మహ్మద్ షమీ (1), బుమ్రా (16), కుల్దీప్ యాదవ్ (9) పరుగులు చేశారు. ఇక ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (9), కోహ్లీ డకౌట్, శ్రేయాస్ అయ్యర్ (4) పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో టీమ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన రాహుల్, సూర్యకుమార్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో రాణించారు. డేవిడ్ విల్లీ ఎక్కుగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్క్ ఉడ్ కు ఒక వికెట్ లభించింది.

Read Also: Sheep Farming : గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..

Exit mobile version