NTV Telugu Site icon

School Bus Caught Fire: స్కూల్ బస్సులో మంటలు.. బస్సులో 16 మంది పిల్లలు

School Bus

School Bus

School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రీత్ విహార్ (ఢిల్లీ)లోని మదర్స్ గ్లోబల్ స్కూల్‌కు చెందిన ఏసీ బస్సులో మంటలు చెలరేగాయని, బస్సు నంబర్ UP16CT9688 అని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 16 మంది పిల్లలు ఉన్నారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండా చిన్నారులను బస్సు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది తమ నైపుణ్యంతో మంటలను ఆర్పి కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?

స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు సహకరించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ పూర్తయిన తర్వాతే అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Ambulance Blast: అంబులెన్స్‌కు మంటలు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి