Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీల మధ్య చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు
- ఒడిస్సా వెళుతున్న ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
- రెండు లారీల మధ్య చిక్కుకున్న ట్రావెల్ బస్సు
- నుజ్జు నుజ్జుగా మారిన ట్రావెల్స్ బస్సు
- తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ మళ్లించేందుకు ప్రయత్నాలు
- ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రులు తుమ్మల పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో దాదాపుగా నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాలని క్రమబద్ధీకరించడం పోలీసులకు భారంగా మారింది. తనికెళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సు ముందు మరో వాహనాన్ని(లారీ) ఢీకొట్టింది. వెనకనుంచి వచ్చిన లారీ మళ్లీ మరొక లారీని ఢీకొట్టడంతో రోడ్డుపైన నిలిచిపోయాయి.
READ MORE: Jangaon District: రూ.300ల కోసం హత్య.. బండరాయితో కొట్టి నిప్పంటించిన స్నేహితులు
Also Read
దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి భద్రాచలం అదేవిధంగా రాజమండ్రి భద్రాచలం నుంచి హైదరాబాద్ రూట్ వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఉదయం నుంచి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.
READ MORE: Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!