Tragedy: కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం – కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు. కారు మునిగిన చోటుకు దగ్గరలో చెట్లకు చిక్కుకుని ఉన్న ఫణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 2 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఫణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం వరద నీటిలో చిక్కుకున్న కారును గుర్తించిన అధికారులు.. కారును బయటకు తీసిన సంగతి తెలిసిందే.
Read Also: Wolf Attack : ఉత్తర ప్రదేశ్ లో రెచ్చిపోతున్న తోడేళ్లు.. కంటిమీద కునుకు మానేసిన 40గ్రామాలు
ఆ కారును గుర్తించినప్పటికీ అందులో అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి నుంచి ఫణి ఆచూకీ తెలియకపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కారు మునిగిన చోటుకు దగ్గరలో చెట్లకు చిక్కుకుని ఉన్న ఫణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నేడు మృతదేహాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఫణి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణాజిల్లా పెడన స్వస్థలం కావడంతో 2 రోజుల క్రితం అక్కడకి వెళ్తూ బుడమేరులో గల్లంతైనట్లు పోలీసుల విచారణలో తెలిసింది.