NTV Telugu Site icon

Travis Head: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్

Travis Head

Travis Head

ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్‌ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.

Read Also: TDP-JanaSena Meeting: రేపట్నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు

ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లో సెంచరీ చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు మ్యాక్స్‌వెల్‌పై ఉంది. 2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. మ్యాక్స్‌వెల్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఉన్నాడు. 2013లో బెంగళూరు వన్డేలో టీమిండియాపై ఫాల్క్‌నర్ 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ 59 బంతుల్లో సెంచరీ సాధించి తన పేరును నాలుగో స్థానంలో నమోదు చేసుకున్నాడు.

Read Also: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..

గత కొన్ని రోజులుగా గాయం కారణంగా.. ట్రావిస్ హెడ్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చిన ట్రావిస్.. ఈరోజు మొదటి మ్యాచ్ ను ఆడేందుకు అవకాశం లభించింది. తాజా ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం సరిగా లేకపోవడంతో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. అయితే ట్రావిస్ తిరిగి జట్టులోకి చేరడంతో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ జోడీ సమస్య పరిష్కారమైంది.

Show comments