NTV Telugu Site icon

Viral News: ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన మామ.. పెళ్లి కూతురు ఇంటిపై విమానం నుంచి డబ్బుల వర్షం(వీడియో)

Pakistan

Pakistan

పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్‌లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.

READ MORE: Kakinada: కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు

ఈ వీడియో పాకిస్థాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌ నగరానికి చెందినది. ఈ వీడియోను ఓ సోషల్ మీడియా వినియోగాదారు షేర్ చేశాడు. దీనిపై ఉర్దూలో సమాచారం అందించాడు. వధువు తండ్రి ఇది కోరినట్లు అందులో రాసి ఉంది. దీని తరువాత, వరుడి తండ్రి అద్దెకు విమానం తీసుకొని వధువు ఇంటిపై కోటి రూపాయల నోట్ల వర్షం కురిపించాడు. ఇది డబ్బు వృథా అని కొందరు విమర్శించారు. అదే సమయంలో కొందరు హేళన కూడా చేశారు. ఇప్పుడు వరుడు తన జీవితంలో తండ్రి తీసుకున్న రుణం తీర్చుకోవలసి ఉంటుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు. “పాకిస్థాన్ ఎందుకు అప్పుల్లో కూరుకుపోయిందో ఇప్పుడు తెలిసింది.” అని ఓ వ్యక్తి కామెంట్ రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

READ MORE: Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం

ఇదిలా ఉండగా… పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు ఇటీవల 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్థాన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్థాన్‌ ఐఎంఎఫ్‌ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.

Show comments