NTV Telugu Site icon

Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం

Fraud

Fraud

Fraud: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్‌ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు. ధన్వంతరి ఫౌండేషన్‌లో బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులు.రెండు నెలల క్రితం సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. దాదాపు 4 వేల మంది బాధితులు ఉండడంతో ఈ రోజు బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు.

Read Also: Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో 540 కోట్ల డిపాజిట్లను కమలాకర్ శర్మ సేకరించినట్లు తెలిసింది. మూడు వేల మంది బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించారు. బాధితులంతా ఓకే కమ్యూనిటీకి చెందినవారు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీసీఎస్ పోలీసులు అటాచ్ చేశారు. దాదాపు 200 మంది బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన ఆస్తుల నమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బు వచ్చేలాగా చూస్తామని డీసీపీ హామీ ఇచ్చారు.