Site icon NTV Telugu

UP: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన ఓ వ్యక్తి.. వేదికపై ప్రసంగిస్తుండగా ఘటన

Up

Up

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.

Benefits of scorpion venom : కోట్లు పలుకుతున్న తేలు విషం.. దాంతో ఏం చేస్తారంటే..

స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పట్టణంలోని అవంతీబాయి కూడలికి చేరుకోగానే.. అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు ఆయనకు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఓ కార్యకర్త వాహనంపై నల్ల ఇంకు పోసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారిని పోలీసులు తరిమికొట్టారు. అనంతరం.. సభా వేదిక వద్దకు చేరుకున్న స్వామి ప్రసాద్ మౌర్య వేదికపై చేరుకుని ప్రసంగిస్తున్నారు. ఇంతలో ముందు వరుసలో కూర్చున్న ఓ యువకుడు లేచి స్వామి ప్రసాద్ మౌర్య వైపు షూ విసిరాడు. యువకుడు విసిరిన షూ పోడియం సమీపంలో అమర్చిన కెమెరా ట్రిపాడ్‌కు తగిలింది.

Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..

యువకుడు బూటు విసిరడంతో సభాస్థలి వద్ద తోపులాట జరిగింది. ఘటనా స్థలం నుంచి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ యువకుడిని ధర్మేంద్ర ధాకడ్ గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత యోగి యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ తోమర్ ఓ వీడియోను విడుదల చేస్తూ షూ విసిరిన వ్యక్తిని ఆ సంస్థ అధికారిగా అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని కపటత్వం అని పిలిచే వారిని, బ్రాహ్మణులను రాక్షసులని పిలిచేవారిని, రామచరిత్ మానస్‌ని అవమానించేవారిని ఇలాంటి బూట్లతో స్వాగతిస్తామని తెలిపారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికీ ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు.

Exit mobile version