Uttar Pradesh: పెళ్లి కావడం లేదని శివలింగాన్ని దొంగలించిన ఓ వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: పెళ్లి కావడం లేదని రోజు పూజించే శివలింగాన్ని మాయం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన యూపీలోని కౌశాంబి జిల్లాలో వెలుగు చూసింది. మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావాన్ మార్కెట్లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల చోటు.. శ్రావణ మాసం మొత్తం శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. అయితే తన పెళ్లి జరగాలని రోజు ప్రార్థించేవాడు. అయితే శ్రావణం అయిపోయింది. తన కోరిక నెరవేరలేదు. దీంతో మనస్తాపానికి గురైన చోటు శివలింగాన్ని మాయం చేశాడు.
Read Also: Purandeshwari: తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
అయితే ఉదయాన్ని ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు.. శివలింగం కనపడకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో ఆలయ పూజారి వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివలింగాన్ని దొంగిలించడంలో చోటు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే శివలింగాన్ని దొంగిలించి ఆలయంలో ఒకచోట దాచినట్లు తెలిపాడు.
Read Also: Purandeshwari: తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది
దీంతో పోలీసులు శివలింగాన్ని గుర్తించి.. తిరిగి మళ్లీ ఆలయంలో ప్రతిష్టించారు. మరోవైపు నిందితుడు చోటూపై ఐపీసీ సెక్షన్ 379, 411 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు పోలీసులు. ఈ ఘటనపై ఎస్పీ బ్రిజేష్ స్పందిస్తూ.. చోటూ అనే యువకుడు మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావా గ్రామ నివాసి అని తెలిపారు. ఛోటూ శ్రావణ మాసంలో ప్రతిరోజూ గుడికి వెళ్లేవాడని.., అక్కడ ప్రార్థనలు చేసేవాడన్నారు. అతను తన పెళ్లికి సంబంధించి ఒక ప్రమాణం చేశాడని, ఆ ప్రతిజ్ఞ నెరవేరలేదని తెలిసింది. దీంతో శివలింగాన్ని దొంగలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!